ఘనంగా నిర్వహించిన ఏపీయూడబ్ల్యూజే 69వ వ్యవస్థాపక దినోత్సవం
ఐఎన్ బి టైమ్స్ కారంపూడి ప్రతినిధి ఆగష్టు 17;ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ 69వ వ్యవస్థాపక దినోత్సవం ఏపియూడబ్ల్యూజే కారంపూడి శాఖ నాయకత్వం ఆధ్వర్యంలో ఆదివారం ర్యాలీ నిర్వహించడం జరిగింది.స్వర్గీయ మానికొండ చలపతిరావు ఆధ్వర్యంలో (1957) ఏర్పాటైన ఏపీయూడబ్ల్యూజే యూనియన్ ఈ నెల 17వ తేదీకి 69వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకోనున్నది. ఆరు దశాబ్దాలకు పైగా జర్నలిస్టుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న, యూనియన్ వ్యవస్థాపక దినోత్సవాన్ని, కారంపూడి ఏపియూడబ్ల్యూజే ఆధ్వర్య లో చెక్ పోస్ట్ సెంటర్ నుండి నాగులేరు బ్రిడ్జి వాగు ర్యాలీ విజయవంతం జరిగింది. వ్యవస్థాపక దినోత్సవ ర్యాలీలో పల్నాడు జిల్లా కోశాధికారి వెంకటప్పయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు వీరేంద్ర, మండల అధ్యక్షుడు బాణావత్ రాజేష్ నాయక్, కార్యదర్శి అల్లి కరుణాకర్, కోశాధికారి కల్లూరీ గోపి, పత్రిసురేష్, మనం జానీ భాష, ముగ్బుల్ జానీ భాష, భవిరిశెట్టి రామారావు, సూరేపల్లి కోటేశ్వరరావు, సముద్రాల సాయి, నూనె శ్రీనివాసరావు, సూరే వెంకట నాగేశ్వరరావు, జి మణికుమార్, అనిల్, రవితేజ, వర ప్రసాదు, అల్లావుద్దీన్, శీను నాయక్, మిరియాల శీను, వెంకటేష్ మరియు మండల కేంద్రంలో పనిచేసే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పాల్గొన్నారు.
Comment List