ఉమ్మడి గుంటూరు జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా మత్తె కుమార్.
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఆగష్టు 17:ఉమ్మడి గుంటూరు జిల్లాల సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఎలక్షన్స్ సందర్భంగా గుంటూరు, పల్నాడు జిల్లా డిఎస్డివో పి నరసింహారెడ్డి, మరియు శ్రీకాకుళం జిల్లా స్పోర్ట్స్ సెక్రటరీ రమణ బాబు, ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్బాల్ కోఆర్డినేషన్ సెక్రెటరీ పి నరసింహ రెడ్డి, జిల్లా సాఫ్ట్బాల్ సెక్రెటరీ పి సామంత రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో మాచర్ల సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం వ్యాయామ ఉపాధ్యాయుడు మత్తే కుమార్ ను వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు. ఇందుకుగాను సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మాచర్ల ప్రిన్సిపల్ సుజాత హర్షం వ్యక్తం చేశారు. వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన మతేకుమార్ ని, మాచర్ల సెయింట్ ఆన్స్ స్కూల్ ఉపాధ్యాయ, ఉపాధ్యాయుని బృందం సంతోష్, ప్రతాప్, ప్రకాష్, వినేష్, వెంకట్, సబిత, శ్రీను, అనూష, వర్జీని అందరూ అభినందనలు తెలియజేశారు.
Comment List