మహిళల జీవితాల్లో ఆత్మగౌరవాన్ని నింపే పధకం స్త్రీ శక్తి పథకం: పగడాల, లంకా, చొక్కా..
ఐ ఎన్ బి టైమ్స్ రాజుపాలెం ప్రతినిధి ఆగస్టు 17:
స్త్రీ శక్తి... ఇది కేవలం ఆర్థిక భారాన్ని తగ్గించే పధకమే కాదు, మహిళల జీవితాల్లో ఆత్మగౌరవాన్ని నింపే పధకం అని మాజీ మండల ప్రధాన కార్యదర్శులు పగడాల శ్రీనివాసరావు, లంకా వీరయ్య మరియు సీనియర్ నాయకులు చొక్కా మల్లికార్జున రావు అన్నారు.స్త్రీశక్తి ఉచిత బస్సు పథకం గ్రాండ్ సక్సెస్ అయ్యిందని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో మహిళల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని వారు తెలిపారు. గడిచిన 60 గంటల్లో ఆర్టీసీ బస్సుల్లో 16 లక్షల మందికి పైగా ఉచితంగా మహిళలు ప్రయాణించారని తెలియజేశారు. పథకం తొలిరోజు ఉచిత బస్సు ప్రయాణాలతో రూ.5 కోట్ల మేర మన రాష్ట్రంలో మహిళలు ఆదా చేసుకున్నారని తెలిపారు.మహిళా ప్రయాణికుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు ఘాట్ రూట్లలోనూ ఉచిత ప్రయాణానికి అనుమతించాలని సీఎం చంద్రబాబు ఆదేశించించడం శుభపరిణామం అని పేర్కొన్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని ఘాట్ రూట్లలో ఉచిత ప్రయాణానికి గతంలో అనుమతించని ఆర్టీసీ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఘాట్ రూట్లోనూ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తుందని తెలిపారు.ఈ మేరకు తమ మండలంలోని మహిళలంతా సిఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి, మంత్రి నారా లోకేష్ కి, మా ప్రియతమ నాయకులు మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ కి కృతజ్ఞతలు తెలుపుతున్నారని పేర్కొన్నారు.
Comment List