సమస్య పరిష్కారం కై " గ్రీవెన్స్" లో ఫిర్యాదు చేయడం నేరమా?

రాజీ పడి సంతకం పెట్టమని అధికారుల ఒత్తిళ్ళు- ఆత్మహత్యే శరణం అంటున్న బాధితుడు

సమస్య పరిష్కారం కై

ఐ ఎన్ బి టైమ్స్ నాయుడుపేట జూన్ 7:
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకించి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం  " ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక( గ్రీవెన్స్ డే) కార్యక్రమంలో ప్రజా ఫిర్యాదుల సమస్యలకు పరిష్కారం పొందవచ్చనే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. దీని ద్వారా ప్రతి సోమవారం తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో ఎవరికి వారుగా వారి సమస్యలను ఫిర్యాదు రూపంలో అందించి పరిష్కరించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తిరుపతి జిల్లా పరిధిలో ఉన్న, పెళ్లకూరు మండలం, పాలచ్చురు గ్రామానికి చెందిన కొప్పల. సుబ్రహ్మణ్యం దళిత కులానికి చెందిన వారు వారి ఇంటి సమీపంలో గత ప్రభుత్వ పాలనలో సర్పంచి ఎత్తుగా రోడ్డు వేయడం, పాత డ్రైనేజీ కాలువను పూడ్చి చేయడంతో గ్రామంలోని వర్షపు నీరు  ఇంటి ఆవరణ చుట్టూ  చేరి  పలుసమస్యలు ఎదుర్కొంటున్నానని ఆయన జిల్లా కలెక్టర్ కు గ్రీవెన్స్ లో పలు పర్యాయాలు ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రస్థాయిలో జరిగే ప్రజా దర్బార్ కార్యక్రమం లో భాగంగా రాష్ట్ర సాంకేతిక శాఖ మంత్రి నారా లోకేష్ బాబుకు ఫిర్యాదును పంపించారు. అయితే అధికారులు సమస్య పరిష్కరించకుండానే పరిష్కారం చేశాం అంటూ, రాజీ పడుతున్నట్లు సంతకం పెట్టమని పలు రకాల ప్రభుత్వ ఉద్యోగులు అనునిత్యం ఫిర్యాదు దారుడిని ఒత్తిడి చేస్తున్నట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరించమని ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేయడం నేరమా! నేరమే అన్నట్లుగా అధికారులు ఈ సమస్య పరిష్కరించకుండా, పరిష్కరించినట్లు చూపించేందుకు నాపై పోలీసు శాఖ అధికారుల వైపు నుండి కూడా వత్తిడి తీసుకురావడంతో నేను చేసిన నేరం ఏమిటని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఓ దళితుడు 
 సమస్యను పరిష్కరించమని అధికారులకు ఫిర్యాదు చేయకూడదా? చేసిన ఎవరెవరో అధికారులు వస్తున్నారు, నాపై ఒత్తిడి తెస్తున్నారు, సమస్య పరిష్కరించకుండానే వెళుతున్నారు, ఇదేనా అధికారుల తీసుకుంటున్న చర్చలు అని అంటున్నారు. మూడు నెలలుగా ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదులు చేయడం తప్ప, నాకు న్యాయం ఎప్పటి వరకు ఏ అధికారి చేయలేదని, సమస్యకు రాజీ పడినట్లు సంతకం మాత్రం పెట్టమని తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. పంచాయితీ కార్యదర్శి నుండి, మండల స్థాయి పోలీస్ అధికారులు సైతం ఈ సమస్య కోసం తీవ్ర ఒత్తిడి చేస్తుండడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి లో
 నలిగిపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. పలు పర్యాయాలు నా ఫిర్యాదులను పలు శాఖల అధికారులు తీసుకొన్నారే కానీ, జిల్లా కలెక్టర్ ని కలసి విన్నివించుకోవాలన్నా గ్రీవెన్స్ ఛాంబర్ లో నన్ను కలవనీయకుండా నా సమస్య చెప్పుకోకుండా చేశారని కూడా తెలియజేశారు. నాలాంటి పేదవారిపై అధికారులు దృష్టి సారించి న్యాయం చేసి ఆదుకోవాల్సిన పరిస్థితి పోయి, గతంలో ఉన్న వైయస్సార్ పార్టీ సర్పంచి చేసిన పని తప్పు కాదని సమర్ధించడం ఏమిటని, నేడు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పాలనలో న్యాయం జరుగుతుందనే ఆశతో మాత్రమే గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని, తెలియజేశారు. జిల్లా అధికారులు ఈ సమస్యను పరిగణలోకి తీసుకొని ఆ నిరుపేద దళిత వృద్ధుడు ఫిర్యాదు చేసిన సమస్యకు పరిష్కారం చేయగలిగితే ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు  అవుతున్న " ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు " ప్రజలలో మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్నో నెలలుగా సమస్య పరిష్కారం కానీ గ్రీవెన్స్ ఫిర్యాదుకు జిల్లా పాలనాధికారి చొరవ చూపి సమస్య పరిష్కారానికి మార్గం చూపగలరని బాధితుడు కోరుకుంటున్నారు.

Tags:
Views: 165

Advertisement

Latest News

తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి. తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి.
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి జులై 06:దుర్గి మండలంలోని హిందూ దేవాలయాలల్లో తెలుగువారి తొలి పండుగ తొలిఏకాదశి వేడుకలను ఆదివారం భక్తులు భక్తి శ్రద్దలతో...
నీ చల్లని నీడలో.. నీ చక్కని సీమలో.. అంటూ భక్తులు.
మంచికల్లు కొండమీద స్వామి మమ్మల్ని మంచిగా చూడయ్యా
ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోవాలి... ఆలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం
డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన కూకట్పల్లి ఇంచార్జ్: బండి రమేష్
వైసీపీ అధినేత జగన్ ను కలిసిన నియోజకవర్గ యువజన అధ్యక్షుడు పాలేటి నాగార్జున
జన సేవాదళ్ ఆధ్వర్యంలో చేయూత