వనం మానవుని జీవన విధానం:ఎమ్మెల్యే జూలకంటి
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి జూన్ 08 :చెట్లను నాటి, వనాల పెంపకానికి ఉద్యమిస్తే మానవ జీవన విధానంలో ఎన్నో అద్భుతాలను సృష్టించవచ్చని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాఠశాల ప్రాంగణంలో అధికారులు, ఓటమి నేతలతో కలిసి వివిధ రకాల మొక్కలను ఆయన నాటారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా, పచ్చదనంగా ఉన్నప్పుడే ప్రాంతాల్లో ప్రశాంతత సంతరించుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags:
Views: 2
Latest News
06 Jul 2025 22:16:33
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి జులై 06:దుర్గి మండలంలోని హిందూ దేవాలయాలల్లో తెలుగువారి తొలి పండుగ తొలిఏకాదశి వేడుకలను ఆదివారం భక్తులు భక్తి శ్రద్దలతో...
Comment List