డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం
ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ
ఐ ఎన్ బి టైమ్స్ సులూరుపేట ప్రతినిధి, జూన్ 26 :తిరుపతి జిల్లా సూళ్లూరుపేట లో మాదకద్రవ్య దుర్వినియోగం మరియు వ్యతిరేక దినం సందర్భంగా హోలీ క్రాస్ సర్కిల్ నుండి బస్టాండ్ ఆవరణంలోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. స్కూల్ విద్యార్థులతో, అంగనవాడి వర్కర్లు, పోలీస్ సిబ్బంది తో కలసి ర్యాలీ నిర్వహించి డ్రగ్స్ వద్దు స్కిల్స్ ముద్దు అనే నినాదంతో ప్ల కార్డులు పట్టుకొని ర్యాలీగా వెళ్లి బస్టాండ్ ఆవరణంలో మానవహారం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలనేదే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్దేశమని, యువత డ్రగ్స్ కు అలవాటు పడి బంగారు లాంటి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని, డ్రగ్స్ పై ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతున్నారని, మీ చుట్టుపక్కల డ్రగ్స్ ఉన్నట్టుగానీ, తీసుకుంటున్నట్టు మీకు తెలిసినట్లయితే వెంటనే 1972 నెంబర్ కాల్ చేసి పోలీస్ సిబ్బందికి తెలియజేయాలని తెలిపారు.
Comment List