శేరిలింగంపల్లి నియోజకవర్గ సమగ్ర,సంతులిత , అభివృద్దే నా ధ్యేయం PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ
ఐ ఎన్ బి టైమ్స్ కూకట్పల్లి ప్రతినిధి, జూన్ 19: 3 కోట్ల 30 లక్షల రూపాయలతో ఆల్విన్ కాలనీ డివిజన్ లోని పలు కాలనీలలో సీసీ రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన మరియు క్రిస్టియన్ స్మశాన వాటిక మరియు పార్క్ లను ప్రారంభోత్సవం చేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ, శంషిగుడా, HMT శాతవాహన నగర్ కాలనీలలో రూ. 3 కోట్ల 30 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు మరియు క్రిస్టియన్ స్మశాన వాటిక, పార్క్ అభివృద్ధి నిర్మాణము పనులకు కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్ , నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ .ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం మరియు శేరిలింగంపల్లి నియోజకవర్గం మరియు కాలనీ ల అభివృద్దే ధ్యేయంగా ప్రజల సౌకర్యార్థం 3 కోట్ల 30 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన మరియు మరియు క్రిస్టియన్ స్మశాన వాటిక, పార్క్ లను ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగినది అని, సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, కాలనీ వాసులకు ఉపశమనం లభించింది అని, మౌళిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తానని PAC చైర్మన్ గాంధీ అన్నారు. సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి మార్గదర్శకం లో శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన ,అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదితానని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు. అదేవిధంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, సీసీ రోడ్లు వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ,నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని , ప్రజలకు ట్రాఫిక్ రహిత ,సుఖవంతమైన ,మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని,అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని PAC చైర్మన్ గాంధీ చెప్పడం జరిగినది. పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని PAC చైర్మన్ గాంధీ అధికారులను ఆదేశించడం జరిగినది , ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలిపిస్తామని ,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని PAC చైర్మన్ గాంధీ చెప్పడం జరిగినది. నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ,అన్నివేళలో ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ,మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని, శేరిలింగంపల్లి డివిజన్ మరియు శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని PAC చైర్మన్ గాంధీ పునరుద్ఘాటించారు.ఆల్విన్ కాలనీ డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ హిందూ,ముస్లిం, క్రిస్టియన్ స్మశాన వాటికలను నిర్మిచుకోవడం జరిగినది . ఒక కోటి రూపాయలతో క్రిస్టియన్ స్మశాన వాటిక ను సకల సదుపాయాలతో ,అన్ని హంగులతో సుందరవనంగా మరో మహా ప్రస్థానం లాగా తీర్చిదిద్దడం జరిగినది అని, ఈ స్మశాన వాటికలో అంత్యక్రియల ఫ్లాట్ ఫారం, అడ్మినిస్ట్రేషన్ భవనం ,అంతర్గత రోడ్లు ,టాయిలెట్లు ,వాటర్ ఫౌంటైన్,స్నానాల గదులు , మనిషి జీవిత చరిత్ర సైకిల్ ( మనిషి పుట్టుక నుండి మరణించే వరకు) తెలిపే జీవిత చక్రం ను చిత్రాల తో కూడిన గోడను మరియు సమాశం వాటిక చుట్టూ ప్రహరీ గోడను నిర్మించడం జరిగినది అని PAC చైర్మన్ గాంధీ అన్నారు. అదేవిధంగా ఆహ్లాదకరమైన, ప్రశాంత వాతావరణం కలిపించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగినది అని,మనిషి మరణాంతరం చివరి దశలో అంత్యక్రియలు సజావుగా ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని రకాల వసతుల కలిపించడం జరిగినది అని PAC చైర్మన్ గాంధీ తెలియసారు .ప్రతి కాలనీ లో పార్క్ లను అభివృద్ధి చేసి ప్రజలకు స్వచ్ఛమైన ఆహ్లదకరమైన వాతావరణం కల్పిస్తామని, ప్రజలు ఉదయం, సాయంత్రం పూట వాకింగ్ చేసుకోవడానికి, ఓపెన్ జిమ్ చేసుకోవడానికి, పిల్లలు వృద్ధులు కాలక్షేపానికి పార్కులు ఎంతగానో దోహదపడుతాయి అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.
*శంకుస్థాపన చేసిన కార్యక్రమాల వివరాలు :*
*మంజూరైన అభివృధి పనుల వివరాలు*
*1.ఎల్లమ్మ బండ లో రూ.100.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన క్రిస్టియన్ స్మశాన వాటిక ను ప్రారంభించడం జరిగినది**
*2.ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ప్రధాన రహదారి నుండి శంషిగుడా ప్రభుత్వ పాఠశాల వరకు (హై టెన్షన్ లైన్ కింద లింక్ రోడ్డు ) రూ.1కోటి 50 లక్షల రూపాయల అంచనావ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణం పనులకు శంకుస్థాపన **
*3.HMT శాతవాహన నగర్ కాలనీ లో రూ.80.00 లక్షల రూపాయల అంచనావ్యయంతో చేపట్టిన పార్క్ అభివృద్ధి నిర్మాణం పనులు మరియు సుందరీకరణ పనులు పూర్తయిన సందర్భంగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగినది.**
పైన పేర్కొన్న సీసీరోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన మరియు క్రిస్టియన్ స్మశాన వాటిక మరియు పార్క్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగినది అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు, డివిజన్ పాస్టర్లు, కాలనీ వాసులు, కాలనీల అసోసియేషన్ సభ్యులు,మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
Comment List