వెయ్యి వెన్నుపోటుల సమాహారం జగన్..! - ద్రోహులతో నిండిన పార్టీ వైసీపీ..!

ఎమ్మెల్యే జూలకంటి ధ్వజం..!

వెయ్యి వెన్నుపోటుల సమాహారం జగన్..!  - ద్రోహులతో నిండిన పార్టీ వైసీపీ..!

ఐ ఎన్ బి టైమ్స్ వెల్దుర్తి ప్రతినిధి జూన్: 07వెయ్యి వెన్నుపోటులకు సమాహారం పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి అని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ధ్వజమెత్తారు. శనివారం వెల్దుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.., అన్నీ వర్గాలకు వెన్నుపోటు పొడిచి.., సిగ్గులేకుండా వెన్నుపోటు దినం అని కార్యక్రమాలు చేయడం సిగ్గు చేటు అన్నారు. పిన తండ్రికి .., కన్న తల్లికి, తోడబుట్టిన చెల్లెలకు వెన్నుపోటు పొడిచి వారి కుటుంబాలను వీధిన పడేసిన పరమ దుర్మార్గుడు జగన్ రెడ్డి అని విమర్శించారు.  బడుగు బలహీన, అనగారిన వర్గాలను సామాజికంగా, ఆర్థికంగా వారి వెన్ను విరిచి ఐదేళ్లు నరకం చూపించారని ఆరోపించారు. వైన్, మైన్, ల్యాండ్, శాండ్ కుంభకోణాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వెన్ను విరిచి.., లక్షల కోట్లు దోచుకుంది మీరు కాదా అని  ప్రశ్నించారు. చదువుకున్న యువత ఆశలపై నీళ్లు చల్లి.., వారి బంగారు భవిష్యత్తును అంధకారంలో పడేసింది మీరు కాదా అని ఆయన నిలదీశారు. ఎస్సీ - ఎస్టీ, బీసీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్ళించిన జగన్ రెడ్డి.. వారిని సామాజికంగా దెబ్బతీశారని వివరించారు. దుల్హన్ పథకాన్ని రద్దుచేసి, ముస్లింలను నిలువున మోసం చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను అన్ని విధాలుగా మోసం చేసి.., నేడు వెన్నుపోటు దినం అంటూ రోడ్డెక్కడం హాస్యస్పందంగా ఉందన్నారు. అందుకే ప్రజలు జగన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా బాగా బుద్ధి చెప్పారని ఆయన పేర్కొన్నారు. ఏడాది కూటమి ప్రభుత్వ పాలనలో అన్నీ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ.., ప్రజల మన్నలను పొందుతోందని చెప్పుకొచ్చారు. గత పాలనలో జరిగిన ఆర్ధిక విధ్వంసాన్ని లెక్కలు వేసుకుంటూ.., పథకాలకు అయ్యే ఖర్చులను బేరీజు చేసుకుంటూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఎంతో నిబద్దతతో ముందుకు పోతున్నారని వివరించారు.  

 ఫ్యాక్షనిస్టులు, రౌడీ షీటర్లే మిత్రులు..!

 గంజాయి మామ జగన్ రెడ్డికి ఫ్యాక్షనిస్టులు, రౌడీ షీటర్లే మిత్రులని ఎమ్మెల్యే జూలకంటి ఎద్దేవా చేశారు. తెనాలిలో గంజాయి బ్యాచ్ పోలీసులపై దాడి చేసి.., హల్చల్ సృష్టిస్తే.., వారికి మద్దతు ఇచ్చి.. పరామర్శకు వెళ్లడం విడ్డూరమన్నారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాజకీయం మూడు హత్యలు, ఆరు దౌర్జన్యాలతో విరాజిల్లుతుంటే.. ఆయనకు పార్టీలో జిల్లా పదవులు కట్టబెట్టి.., ప్రోత్సహిస్తుంటారని విమర్శించారు. దందాలు, దౌర్జన్యాలు, దాడులు చేసేవారికి వైసీపీలో జగన్ రెడ్డి పెద్దపేట వేస్తారని ఆరోపించారు. అందుకే ఏపీలో సైకోలను సాగనంపి.., ప్రజాస్వామ్యానికి ప్రజలు పట్టం కట్టారని ఆయన వివరించారు.  ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Tags:
Views: 4

Advertisement

Latest News

తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి. తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి.
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి జులై 06:దుర్గి మండలంలోని హిందూ దేవాలయాలల్లో తెలుగువారి తొలి పండుగ తొలిఏకాదశి వేడుకలను ఆదివారం భక్తులు భక్తి శ్రద్దలతో...
నీ చల్లని నీడలో.. నీ చక్కని సీమలో.. అంటూ భక్తులు.
మంచికల్లు కొండమీద స్వామి మమ్మల్ని మంచిగా చూడయ్యా
ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోవాలి... ఆలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం
డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన కూకట్పల్లి ఇంచార్జ్: బండి రమేష్
వైసీపీ అధినేత జగన్ ను కలిసిన నియోజకవర్గ యువజన అధ్యక్షుడు పాలేటి నాగార్జున
జన సేవాదళ్ ఆధ్వర్యంలో చేయూత