కంచరగుంటలో ఉచిత మెగా వైద్య శిబిరం
వైద్య శిబిరాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన యాగంటి..
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి జూన్ 22:పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం,కంచరగుంట గ్రామంలో -ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఫర్ మెడిసిన్ అండ్ సైన్స్ ట్రస్ట్ వారిఆశయం ప్రతి ఒక్కరికి వైద్య సేవలు అందించడ మేనని ట్రస్ట్ ప్రెసిడెంట్ డా. పి. రాజశేఖర్ ఆర్థో పెడిక్ సర్జన్ అన్నారు.ఆదివారం కంచరగుంట గ్రామంలో యం. పి.పి. స్కూల్ ఆవరణలో మాదాసు వెంకటేశ్వర్లు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరంలో పాల్గొని మాట్లాడారు. ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని యాగంటి మల్లికార్జున రావు మాచర్ల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభంచే శారు. ఈ సందర్బంగా మల్లికార్జున రావు మాట్లాడుతూ పల్నాడు ప్రాంతం లో వెనుక బడిన గ్రామం లో ఉచిత మెగా వైద్య శిబిరం ను ఏర్పాటు చేయించిన మాదాసు మురళీ కృష్ణ, గోపి కృష్ణలను అభినం దించారు.
ఈ వైద్యశిబిరం లో 22 రకాల వ్యాధులకు 13 మంది వైద్య నిపుణులు డాక్టర్లు పలు ప్రాం తాలనుండి వచ్చి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా మందులు పంపిణి చేశారు సుమారు 1000మంది రోగులు వైద్య పరీక్షలు చేయిం చుకున్నారు.అందులో 14 మందిని రిఫర్ చేశారు. పలువురు డాక్టర్లు బిపి,షుగర్,థైరాయిడ్, ఇ సి జి, ఎముకుల కోసం బి యం. డి. పి ఎఫ్ టి.పరీక్షలను ఉచితంగా చేశారు.అనంతరం రోగులకు తగిన జాగ్రత్తలు,ఆరోగ్య సూత్రాలను గురించి తెలి పారు.
ఈకార్యక్రమంలో వైద్య నిపుణులు డాక్టర్లు వి. బాలబాలాజీ, యం ప్రసన్న కుమార్,పి. వెంక
ట శ్రీధర్,ఎస్. ఉదయశంకర్, ఐశ్రీనివాస్,బి.మృదుల,యన్.వి. పద్మిని, పి, యశ్వంత్. కె వెంకటకృష్ణ, రాజనాల మధు. ఆర్. సాయికృష్ణ, ఎ.మహేష్ కుమార్, వారి సిబ్బంది, గ్రామ పెద్దలు, నాయకులు, పేషంట్స్, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Comment List