ఆహార పదార్థాల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారా: న్యాయమూర్తి మీనాక్షి
ఐ ఎన్ బి టైమ్స్ నాయుడుపేట ప్రతినిధి
జూన్ 26:హాస్టల్ విద్యార్థులకు వడ్డిస్తున్న ఆహార పదార్థాల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారా? అంటూ నాయుడుపేట సివిల్ కోర్టు జడ్జి మీనాక్షి ఆరా తీశారు. గురువారం ఆమె ఎస్ ఐ స్వప్నతో కలసి ఓ చెలి మండల పరిధిలోని, మాకాటి వారి కండ్రిగలో ఉన్న ఏకలవ్య గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఆమె మొదటిగా వంటశాలలో తయారు చేసి ఉన్న ఆహార పదార్థాల నాణ్యతలను పరిశీలించారు. పిల్లలకు ఆహార పదార్థాలతో ఎటువంటి అనారోగ్య పరిస్థితులు తలెత్తకుండా రుచికరంగా వండి వంటించాలని సూచించారు. అనంతరం పాఠశాల పరిసరాలు, విద్యార్థుల బోధన పలు విషయాలపై గురుకుల పాఠశాల అధికారులతో చర్చించారు. అటు విద్యాబోధనలో కానీ, ఆహార పదార్థాల నాణ్యతలో కానీ ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా చూసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
Comment List