సామాన్యుల ఆకాంక్షలకు గొంతుకగా..యువతకు స్ఫూర్తిగా.. భవిష్యత్తు భారతానికి నాయకుడు రాహుల్ గాంధీ  - టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం."

సామాన్యుల ఆకాంక్షలకు గొంతుకగా..యువతకు స్ఫూర్తిగా.. భవిష్యత్తు భారతానికి నాయకుడు రాహుల్ గాంధీ  - టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం.

ఐ ఎన్ బి టైమ్స్ కూకట్పల్లి ప్రతినిధి, జూన్ 19:" సమానత్వం, సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడే యోధుడు భావిభారత ఆశాజ్యోతి  రాహుల్ గాంధీ  - టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం."ఈ రోజు బాలాజీనగర్ డివిజన్ వివేక్ నగర్ లోని ప్రాధమిక పాఠశాలలో డివిజన్ అధ్యక్షులు కృష్ణ రాజ్ పుత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత భావి భారత ప్రధాని  రాహుల్ గాంధీ  జన్మదిన వేడుకలకు ముఖ్య అతిధిగా టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం హాజరై కేక్ కట్ చేసి, విదార్థులకు పుస్తకాలు, స్టేషనరీ వస్తువులు అందచేశారు. ఈ సందర్బంగా సత్యం శ్రీరంగం మాట్లాడుతూ నిగర్వం, దేశ సేవ పట్ల నిబద్ధత, సామాజిక న్యాయం కోసం మీ నిరంతర కృషి మాకందరికీ ఆదర్శం. ఆయురారోగ్యాలతో, సంతోషంతో, మరెన్నో ఉన్నత లక్ష్యాలను సాధిస్తూ దేశ సేవలో నిరంతరం ముందుకు సాగాలని మనసారా కోరుకుంటున్నాను అని అన్నారు. రాహుల్ గాంధీ  దేశానికి విశ్వసనీయత కలిగిన, ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసే నిజమైన ప్రజానాయకులు. ప్రజాస్వామ్యం సవాళ్లను ఎదుర్కొంటున్న సమయాల్లో, మీ ధైర్యం మరియు స్పష్టత మెరుగైన, మరింత సమగ్రమైన భారతదేశం కోసం ఆశను అందిస్తాయి. సత్యం మరియు న్యాయం కోసం మీ పోరాటంలో ఈ సంవత్సరం మీకు బలం, ఆరోగ్యం మరియు నిరంతర సంకల్పాన్ని తీసుకురావాలి.  రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశంలో సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్యం బలపడుతున్నాయి. రాహుల్ గాంధీ జన్మదినాన్ని మనం ఈ రోజు ఒక్క వేడుకగా కాదు, భావితరాలకు ఆశాజ్యోతి చూపించే ఉద్యమంగా జరుపుకుంటున్నాం.. ఈ పుణ్యదినాన్ని పురస్కరించుకొని ప్రతి కార్యకర్తలో ఆత్మవిశ్వాసం,సేవాభావం పెరగాలి. రాహుల్ గాంధీ  ఆశయాలు సాకారం కావాలని మనమంతా కలసి కృషి చేయాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో బి బ్లాక్ అధ్యక్షులు తూము వేణు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శేరి సతీష్ రెడ్డి, సాధు ప్రతాప్ రెడ్డి, సంజీవ్, దేశాల్, AMC వైస్ చైర్మన్ ప్రకాష్ ముదిరాజ్, డైరెక్టర్లు ఫణికుమార్, అరుణ్ గౌడ్, సుధాకర్ రెడ్డి, కొండల్ రెడ్డి, భాస్కర్ సప్పిడి, యూత్ కాంగ్రెస్ నాయకులు జహింగిర్, కూకట్ పల్లి నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి. సలీం, మైనారిటీ సీనియర్ నాయకులు ముగ్ధుమ్, మైఖేల్, బాలయ్య, డివిజన్ మహిళా అధ్యక్షురాళ్లు మారుతీ, సీనియర్ మహిళా నాయకురాళ్లు రేష్మా, స్వరూప గౌడ్, బండి సుధ, శ్రీకాంత్, సుల్తాన్, అక్బర్, శ్రవణ్, జిబిన్, అంజి, శ్రీకాంత్, శివ గౌడ్, ఇంద్రనాధ్, పాఠశాల అధ్యాపకులు సృజన, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Tags:
Views: 8

Advertisement

Latest News

తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి. తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి.
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి జులై 06:దుర్గి మండలంలోని హిందూ దేవాలయాలల్లో తెలుగువారి తొలి పండుగ తొలిఏకాదశి వేడుకలను ఆదివారం భక్తులు భక్తి శ్రద్దలతో...
నీ చల్లని నీడలో.. నీ చక్కని సీమలో.. అంటూ భక్తులు.
మంచికల్లు కొండమీద స్వామి మమ్మల్ని మంచిగా చూడయ్యా
ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోవాలి... ఆలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం
డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన కూకట్పల్లి ఇంచార్జ్: బండి రమేష్
వైసీపీ అధినేత జగన్ ను కలిసిన నియోజకవర్గ యువజన అధ్యక్షుడు పాలేటి నాగార్జున
జన సేవాదళ్ ఆధ్వర్యంలో చేయూత