బిరబిరా కృష్ణమ్మ రైతులను ఆదుకోవమ్మ..! విగ్రహ ప్రతిష్టామహోత్సవంలో జూలకంటి.
పచ్చదనం ప్రగతికి సోపనాలు.
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి జూన్ 08 :పల్నాడు జిల్లా,మాచర్ల నియోజకవర్గం,రెంటచింతల మండల పరిధిలోని సత్రశాల కృష్ణనదీ తీరాన కొలుదీరిన ప్రముఖ శైవ క్షేత్రం శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లిఖార్జునస్వామి వారి ఆలయం ప్రాంగణంలో శ్రీ కృష్ణవేణి అమ్మవారి విగ్రహ ప్రతిష్టామహోత్సవం ఆదివారం కన్నుల పండువగా సాగింది. ఈ ఉత్సవాలకు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని, ఆయన చేతులమీదిగా అమ్మవారి విగ్రహాన్ని వేదోక్తంగా ప్రతిష్టించారు. అనంతరం గర్భాలయంలో కొలువుదీరిన పరమేశ్వరుడు, పార్వతీ మాతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు పూర్ణకుంభం, మంగళ వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. పూజాదికార్యక్రమాలు అనంతరం వేదపండితులు వేదాశీర్వచనలతో శేష వస్త్రాలను సమర్పించి, తీర్దప్రసాదాలను అందజేశారు. పచ్చదనం ప్రగతికి సోపనాలు.ప్రాంతాల ప్రగతికి పచ్చదనం ఎంతగానో దోహదపడుతోందని ఎమ్మెల్యే జూలకంటి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు సత్రశాల శివాలయం ప్రాంగణంలో కూటమి నేతలతో కలిసి వన మహోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో వివిధ రకాల మొక్కలను నాటారు. ప్రజలు తొలకరిలో పెద్దఎత్తున మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రెంటచింతల మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comment List