జనసేన పార్టీ కూకట్ పల్లి నియోజకవర్గ క్రియాశీలక సభ్యత్వ ఐడి కార్డ్ లను పంపిణీ వేసిన : ప్రేమ కుమార్

జనసేన పార్టీ కూకట్ పల్లి నియోజకవర్గ క్రియాశీలక సభ్యత్వ ఐడి కార్డ్ లను పంపిణీ వేసిన : ప్రేమ కుమార్


ఐ ఎన్ బి టైమ్స్ కూకట్పల్లి ప్రతినిధి, జూన్ 8:ఈరోజు కెపిహెచ్బి కాలనీ 5వ ఫేస్ జనసేన పార్టీ ఆఫీస్ నందు కూకట్ పల్లి నియోజకవర్గం లో పార్టీ క్రియాశీలక  సభ్యత్వము నమోదు చేయించిన వాలంటరీలకు  జన సైనికులకు , వీర మహిళలకు సభ్యత్వ  ఐడి కార్డులను *కూకట్‌పల్లి  నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్  ముమ్మారెడ్డి ప్రేమకుమార్  చేతుల మీదుగా అందజేశారు.*

ఈ సందర్భంగా ప్రేమ కుమార్  మాట్లాడుతూ ప్రమాదవశాత్తు మరణించిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు ఐదు లక్షల చొప్పున అందించి  వారి కుటుంబాలకు భరోసానిచ్చిన అధినేత  పవన్ కళ్యాణ్  ధన్యవాదాలు తెలుపుతూ ఇటువంటి5 లక్షలు ఇచ్చే ఆలోచన ఏ రాజకీయ పార్టీలో లేదని కేవలం జనసేన పార్టీలోనే ఉందని అన్నారు . కూకట్ పల్లి నియోజకవర్గం లో 3000 పైచిలుకు క్రియాశీలక సభ్యత్వాలను నమోదు చేయించిన వాలంటీరులను అభినందిస్తూ రాబోయే రోజులలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్  ఆశయాలను మరియు సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి డివిజన్ కి 3000 పైచిలుకు క్రియాశీలక సభ్యత్వాలు చేయించి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో క్రియాశీలక సభ్యత్వము నమోదు చేయించిన వాలంటరీలు కొల్లా శంకర్ , సలాది శంకర్, దొరబాబు (వెంకట్), పోలే బోయిన శ్రీనివాస్, మత్తి శ్రీనివాస్, ప్రభు చైతన్య, పులగం సుబ్బు , భూ శంకర్, రామకృష్ణ, వెంకటేశ్వరరావు, పాదం సూర్యా, పుష్పలత జనసేన  నాయకులు వీర మహిళలు పాల్గొన్నారు.

Tags:
Views: 15

Advertisement

Latest News

తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి. తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి.
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి జులై 06:దుర్గి మండలంలోని హిందూ దేవాలయాలల్లో తెలుగువారి తొలి పండుగ తొలిఏకాదశి వేడుకలను ఆదివారం భక్తులు భక్తి శ్రద్దలతో...
నీ చల్లని నీడలో.. నీ చక్కని సీమలో.. అంటూ భక్తులు.
మంచికల్లు కొండమీద స్వామి మమ్మల్ని మంచిగా చూడయ్యా
ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోవాలి... ఆలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం
డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన కూకట్పల్లి ఇంచార్జ్: బండి రమేష్
వైసీపీ అధినేత జగన్ ను కలిసిన నియోజకవర్గ యువజన అధ్యక్షుడు పాలేటి నాగార్జున
జన సేవాదళ్ ఆధ్వర్యంలో చేయూత