దుర్గి కేజిబివి లో ఘనంగా యోగా డే
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి జూన్ 21:పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, మండల కేంద్రమైన దుర్గి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం(కేజిబివి) శనివారం అంతర్జాతీయ యోగాడేను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రిన్సిపల్ ఆకుల ఆశాజ్యోతి అధ్యక్షత వహించి విద్యార్థినీ ల చేత యోగా ధ్యానాన్ని విజయవంతంగా నడిపించారు. ఈ సందర్భంగా ఆశాజ్యోతి విద్యార్థినీలను ఉద్దేశించి ప్రసంగిస్తూ జీవితంలో ప్రతి ఒక్కరూ యోగా ను భాగం చేసుకోవాలన్నారు. చదువులో ఏకాగ్రతను యోగా బాగా ఉపయోగ పడుతుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్దినిల చేత ప్రాణాయామం,ధ్యానం, యోగాసనాలు, సూర్య నమస్కారాలు వాటి ప్రాముఖ్యత ను వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయునిలు, యోగా శిక్షకులు పాల్గొన్నారు.
Tags:
Views: 3
About The Author
Related Posts
Post Comment
Latest News
06 Jul 2025 22:16:33
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి జులై 06:దుర్గి మండలంలోని హిందూ దేవాలయాలల్లో తెలుగువారి తొలి పండుగ తొలిఏకాదశి వేడుకలను ఆదివారం భక్తులు భక్తి శ్రద్దలతో...
Comment List