నీ చల్లని నీడలో.. నీ చక్కని సీమలో.. అంటూ భక్తులు.
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి జూలై 06:పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం,నీ చల్లని నీడలో నీ చక్కని సీ మలోచేరి తరించే భాగ్యం కలి గించు మమ్మా అంటూ ఆది వారం అడిగొప్పుల శ్రీ నిదానం పాటి శ్రీలక్ష్మి అమ్మ వారి సన్నిధికి భక్తులు తండోపాతండాలుగా తరలివచ్చారు. శ్రీలక్ష్మి అమ్మ వారి సన్నిధి లో ప్రత్యేక పూజలు,అభిషేకాలు, కుంకుమ అర్చనలు చేసి ఆమె కృపకు పాత్రులై మాకు మోక్షాన్ని ప్రసాదించు అని వేడుకున్నారుమధ్యాహ్నం అగ్ని హోమం గా వించారు. సాయంత్రం శ్రీలక్ష్మి అమ్మవారిని పల్లకి సేవ లోపాల్గొని గుడి చుట్టూ ప్రదర్శనలు చేసి మ్రోక్కు బడులను చెల్లిం చుకొని తీర్ద ప్రసాదంను స్వీకరించారు. ఈ కార్యక్రమం ఆలయ కమిషనర్ ఆదిశేషునాయుడు,ఆలయ శాశ్విత ధర్మ కర్త యాగంటి వెంకటే శ్వర్లు ఆధ్వర్యంలో జరిగింది. అర్చకులు,, పూజారులు,సేవ కులు, భక్తులు తదితరులు పల్లకి సేవలో పాల్గొని తరించి పోయారు.
Comment List