రాజకీయ విద్రోహ శక్తి పిన్నెల్లి..! -  ఫ్యాక్షన్ సంస్కృతిపై ఉక్కుపాదం..!

సోదర్ల అరెస్ట్ తో జెవిశెట్టి సోదర్లకు ఆత్మశాంతి..! -    మచర్ల ఎమ్మెల్యే జూలకంటి ఆగ్రహం..!

రాజకీయ విద్రోహ శక్తి పిన్నెల్లి..! -   ఫ్యాక్షన్ సంస్కృతిపై ఉక్కుపాదం..!

ఐ ఎన్ బి టైమ్స్ వెల్దుర్తి ప్రతినిధి జూన్:07మాచర్ల నియోజకవర్గానికి పట్టిన పీడ, రాజకీయ విద్రోహ శక్తి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ధ్వజమెత్తారు. శనివారం వెల్దుర్తి మండలం,గుండ్లపాడు గ్రామంలో ప్రత్యర్ధుల చేతిల్లో హతులైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జెవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావుల దశదిన కర్మ, సంతాప సభలో ఎమ్మెల్యే జూలకంటి పాల్గొని.., వారి చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించి, శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.., జంట హత్యల కేసులో ఎంతటి వారున్నా.., వదిలే ప్రసక్తే లేదన్నారు. పచ్చని పల్లెల్లో పిన్నెల్లి సోదర్లు కాలుష్యాన్ని సృష్టించి..,  విషబీజాలను నాటుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు, దౌర్జన్యాలతో నియోజకవర్గాన్ని భయబ్రాంతులకు గురిచేయాలని చూసే.. ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. కుహనా ఫ్యాక్షన్ శక్తుల వెన్నులో వణుకు పుట్టించేలా కూటమి ప్రభుత్వం చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఏడాది కాలంలో  జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేకే దాడులు చేయించి, అలజడులు సృష్టిస్తున్నారని ఆయన వాపోయ్యారు. పల్నాడు ప్రశాంతత కోసం సంఘ విద్రోహ శక్తులను చట్టప్రకారం శిక్షిస్తామన్నారు. జెవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావుల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 

కోవర్టు రాజకీయాలు మానుకోకుంటే ఖబడ్దార్..!   

కోవర్టు రాజకీయాలు మానుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకుంటారని పిన్నెల్లి సోదర్లును ఉద్దేశించి ఎమ్మెల్యే జూలకంటి హెచ్చరించారు. వెనకబడిన మాచర్ల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుంటే.., పిన్నెల్లి సోదర్లు రాజకీయ పబ్బం కోసం నీచ రాజకీయాలకు తెరతీస్తున్నారని ఆయన మండిపడ్డారు. వరికపూడిశెలను నిర్మించి.., పల్నాడు అభివృద్దికి కూటమి ప్రభుత్వం బాటలు వేస్తోందని ఆయన భరోసా చేశారు. నీలి, కూలి మీడియాలను అడ్డంపెట్టుకుని రెచ్చిపోతే.., ఊచలు లెక్కపెట్టడం ఖామమని హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికగా కూటమి ప్రభుత్వాన్ని కించపర్చిచేలా పోస్టులు పెడితే చట్టప్రకారం చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్ధాయి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Tags:
Views: 1

Advertisement

Latest News

తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి. తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి.
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి జులై 06:దుర్గి మండలంలోని హిందూ దేవాలయాలల్లో తెలుగువారి తొలి పండుగ తొలిఏకాదశి వేడుకలను ఆదివారం భక్తులు భక్తి శ్రద్దలతో...
నీ చల్లని నీడలో.. నీ చక్కని సీమలో.. అంటూ భక్తులు.
మంచికల్లు కొండమీద స్వామి మమ్మల్ని మంచిగా చూడయ్యా
ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోవాలి... ఆలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం
డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన కూకట్పల్లి ఇంచార్జ్: బండి రమేష్
వైసీపీ అధినేత జగన్ ను కలిసిన నియోజకవర్గ యువజన అధ్యక్షుడు పాలేటి నాగార్జున
జన సేవాదళ్ ఆధ్వర్యంలో చేయూత