మంచికల్లు కొండమీద స్వామి మమ్మల్ని మంచిగా చూడయ్యా

మంచికల్లు కొండమీద స్వామి మమ్మల్ని మంచిగా చూడయ్యా

ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి జులై 06 :పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, రెంటచింతల మండలంలోని మంచికల్లు గ్రామానికి మూడు కిలోమీటర్లు సమీపమున ఒకవైపు బుగ్గ వాగు డ్యాం మరోవైపు కొండపైన కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉత్తర దిక్కుగా తిరిగి ఉండటం ఈ గుడి యొక్క ప్రత్యేకత  ఇక్కడ స్వామివారికి నిత్యం ధూప దీప నైవేద్యం ప్రధాన అర్చకులు అయినటువంటి కారంపూడి వెంకట చార్యులు చేతుల మీదుగా జరుగుతూ ఉంటాయి. తొలి ఏకాదశి రోజున ఇక్కడ గుడిలో పెద్ద పండుగల జరుపుకోవడం మంచికల్లు గ్రామస్తులకు ఎప్పటినుంచో వస్తున్న ఆచారం. తొలి ఏకాదశి రోజు న ఈ ఆలయం నందు అన్నదాన కార్యక్రమం  అలాగే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ఇక్కడ ప్రజలు జరుపుతారు.
తొలి ఏకాదశి గురించి వివరించిన ప్రధాన అర్చకులు వారి మాటల్లో ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి, మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు.సూర్య వంశంలో ప్రఖ్యాతరాజు మాంధాత. అతడు ధర్మము తప్పడు, సత్యసంధుడు. అతని రాజ్యంలో ఒకసారి తీవ్ర కరువు వచ్చింది. దానితో ప్రజలు పడరాని పాట్లు పడుతుంటే అంగిరసుడు సూచన పై ఈ శయనైక ఏకాదశి వ్రతాన్ని భక్తితో చేస్తాడు దానితో వర్షం వచ్చి కరువు తీరి ప్రజలు సుఖంగా వున్నారని పురాణాలు చెపుతున్నాయి. విష్ణుమూర్తి యోగనిద్రలోకి వెళతాడని పెద్దలు చెప్పగానే, నిజంగానే దేవుడు నిద్రపోతాడా అని ఒక సందేహం కలుగుతుంది. విష్ణువు అంటే సర్వవ్యాపి అని అర్థం. అంటే విష్ణువు అనే పదానికి అంతర్లీనంగా సూర్యుడు అని అర్థం అన్నమాట. ఇప్పటివరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు, ఈ రోజు నుంచి దక్షిణదిక్కుకు వాలుతాడు. అంటే ఈ రోజు మొదలుగా దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తాడు. దానినే సాధారణ పరిభాషలో నిద్రపోవడం అని అభివర్ణించారు. సాక్షాత్తు భగవంతుడే నిద్రిస్తుంటే ఈ పూజలు ఎవరికి చేయాలి అనుకోవచ్చు. ఈ నెలలోనే ప్రకృతిలో, పర్యావరణంలో మార్పులు వస్తాయి. తద్వారా మన శరీరానికి జడత్వం వచ్చి, అనేక రోగాలు చుట్టుముడతాయి. ఉపవాసం వల్ల జీర్ణకోశం పరిశుద్ధమై, దేహం నూతనోత్తేజాన్ని సంతరించుకుంటుంది. ఇంద్రియనిగ్రహాన్ని కలిగిస్తుంది. ఇంతేకాక కష్టపరిస్థితుల్లోను, భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు విపరీతమైన పరిస్థితులను ఎదుర్కోవడం కోసమే ఈ కఠిన ఉపవాసాలు, ఆచారాలు ఏర్పడ్డాయి. ఇందువలన కామక్రోధాదులను విసర్జించగలుగుతారు. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు. అలా ఏకాదశినాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది. ఈ పండుగకు పేల పిండిని తినే ఆచారము ఉన్నది పేలాలలో బెల్లాన్ని, యాలకులను చేర్చి దంచి ఈ పిండిని తయారుచేస్తారు ఈ దినాన ప్రతి దేవాలయంలోను పేలా పిండిని ప్రసాదం కూడా ఇస్తారు.ఆరోగ్యపరంగా కూడా ఈ పిండి చాలా మంచిది. బాహ్య ఉష్ణోగ్రతలకు అనుగుణంగా దేహం మార్పులు చెందుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం. కావున శరీరానికి ఈ పిండి వేడిని కలుగజేయడమేగాక, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. వర్షాకాలంలో వ్యాధి బారిన పడటానికి ఉన్న అనేక అవకాశాలను ఇది తిప్పికొడుతుంది.

 

Tags:
Views: 1

Advertisement

Latest News

తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి. తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి.
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి జులై 06:దుర్గి మండలంలోని హిందూ దేవాలయాలల్లో తెలుగువారి తొలి పండుగ తొలిఏకాదశి వేడుకలను ఆదివారం భక్తులు భక్తి శ్రద్దలతో...
నీ చల్లని నీడలో.. నీ చక్కని సీమలో.. అంటూ భక్తులు.
మంచికల్లు కొండమీద స్వామి మమ్మల్ని మంచిగా చూడయ్యా
ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోవాలి... ఆలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం
డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన కూకట్పల్లి ఇంచార్జ్: బండి రమేష్
వైసీపీ అధినేత జగన్ ను కలిసిన నియోజకవర్గ యువజన అధ్యక్షుడు పాలేటి నాగార్జున
జన సేవాదళ్ ఆధ్వర్యంలో చేయూత