ప్రతిరోజు యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

ప్రతిరోజు యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి జూన్ 08 :యోగాతో సంపూర్ణ ఆరోగ్యం,     ప్రతిరోజు యోగాతో సంపూర్ణ ఆరోగ్యం మంతులమవుతామని ఎక్స్ డిప్యూటీ డీఈవో గాదె రామకృష్ణారావు అన్నారు. మాచర్ల మున్సిపల్ కమిషనర్ డి .వేణుబాబు ఆధ్వర్యంలో మే 21వ తేదీ నుండి మున్సిపల్ ఆఫీసులో ప్రతిరోజు జరిగే యోగా కార్యక్రమం లో భాగంగా ఆదివారం మాచర్ల మున్సిపల్ ఆఫీసులో జరిగిన యోగ కార్యక్రమంలో పట్టణంలోని సీనియర్ సిటిజన్స్ అందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎక్స్ డిప్యూటీ డీఈఓ గాదె రామకృష్ణారావు మాట్లాడుతూ ప్రకృతి సిద్ధమైన గాలి, ప్రశాంత వాతావరణంలో  ప్రతిరోజు ఉదయం 6:30 నుండి 7:30 వరకు రెగ్యులర్ గా జరుగుతుందని ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ మెట్టు గోవింద రెడ్డి మాట్లాడుతూ ఈనెల 21న విశాఖపట్నంలో జరగబోవు అంతర్జాతీయ యోగా డేను పురస్కరించుకొని  మన ప్రధానమంత్రి  ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో యోగాంధ్ర 2025 ను విశాఖపట్నం లో జరగబోయే కార్యక్రమానికి 5 లక్షల మందితో వ చేయాలని పిలుపునిచ్చారు అంతేకాకుండా యోగాను ప్రతి ఇంటికి కాకుండా ప్రతి వ్యక్తికి అందేలా మనమందరము కృషి చేయాలని మెట్టు గోవింద్ రెడ్డి పిలుపునిచ్చారు కార్యక్రమం అనంతరం యోగాలో నైపుణ్యత ప్రదర్శించినటువంటి సీనియర్ సిటిజన్స్ కు బహుమతులు అందజేశారు.

Tags:
Views: 3

Advertisement

Latest News

తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి. తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి.
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి జులై 06:దుర్గి మండలంలోని హిందూ దేవాలయాలల్లో తెలుగువారి తొలి పండుగ తొలిఏకాదశి వేడుకలను ఆదివారం భక్తులు భక్తి శ్రద్దలతో...
నీ చల్లని నీడలో.. నీ చక్కని సీమలో.. అంటూ భక్తులు.
మంచికల్లు కొండమీద స్వామి మమ్మల్ని మంచిగా చూడయ్యా
ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోవాలి... ఆలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం
డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన కూకట్పల్లి ఇంచార్జ్: బండి రమేష్
వైసీపీ అధినేత జగన్ ను కలిసిన నియోజకవర్గ యువజన అధ్యక్షుడు పాలేటి నాగార్జున
జన సేవాదళ్ ఆధ్వర్యంలో చేయూత