SSC సప్లిమెంటరీలో ఉత్తీర్ణులకు సీపెట్ డిప్లొమా కోర్సులలో ప్రవేశానికై అవకాశం

SSC సప్లిమెంటరీలో ఉత్తీర్ణులకు సీపెట్ డిప్లొమా కోర్సులలో ప్రవేశానికై అవకాశం

ఐ ఎన్ బి టైమ్స్ విజయవాడ జూన్ 29 :“భారత ప్రభుత్వ విద్యా సంస్థ “సీపెట్ - విజయవాడ” లో ఉద్యోగ కల్పనే లక్ష్యముగా 10వ తరగతి సప్లిమెంటరీలో పాస్ అయిన విద్యార్థులకు 3 సం.ల వ్యవధి గల డిప్లోమా ఇన్ ప్లాస్టిక్స్ టెక్నాలజీ (DPT), డిప్లోమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ టెక్నాలజీ (DPMT) కోర్సుల్లో ప్రవేశానికి ప్రత్యేక అవకాశం కల్పిస్తున్నట్లు డైరెక్టర్ & హెడ్ డాక్టర్. Ch. శేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాల ప్రాంగణంలోనే విద్యార్థినీ విద్యార్థులకు విడివిడిగా హాస్టల్ వసతి, నిబంధనలను అనుసరించి అర్హులైన విద్యార్థులకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి "ఫీజు రీయింబర్స్మెంట్" సదుపాయాలు ఉన్నాయని, పరిమితమైన సీట్లు మాత్రమే కలవని, ఆసక్తి గల విద్యార్థులు జులై 10 వ తేదీ, గురువారం లోపుగా దరఖాస్తు చేసుకోవాలని  డైరెక్టర్ శేఖర్ తెలిపారు. ఈ కోర్సులను పూర్తిచేసిన వారికి ప్లాస్టిక్స్ రంగంలో గల బహుళ జాతి సంస్థ(MNC) & అనుబంధ సంస్థలలో జూ. ఇంజనీర్ (ప్రొడక్షన్), మౌల్డ్ డిజైనర్ & మేకర్, జూ. ఇంజనీర్ (మైంటెనెన్స్) వంటి ఉద్యోగ అవకాశాలు కలవని, ప్రారంభ వేతన స్థాయి నెలకు Rs. 18,000/- నుంచి Rs.22,000/- వరకూ ఉంటుందని, సాధారణ విద్యార్థులు కూడా మెరుగైన విజయాన్ని సాధించవచ్చని, దరఖాస్తు విధానం మరియు ఇతర సహాయతకోసం 7893586494 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శేఖర్ సూచించారు”

Tags:
Views: 16

Advertisement

Latest News

తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి. తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి.
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి జులై 06:దుర్గి మండలంలోని హిందూ దేవాలయాలల్లో తెలుగువారి తొలి పండుగ తొలిఏకాదశి వేడుకలను ఆదివారం భక్తులు భక్తి శ్రద్దలతో...
నీ చల్లని నీడలో.. నీ చక్కని సీమలో.. అంటూ భక్తులు.
మంచికల్లు కొండమీద స్వామి మమ్మల్ని మంచిగా చూడయ్యా
ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోవాలి... ఆలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం
డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన కూకట్పల్లి ఇంచార్జ్: బండి రమేష్
వైసీపీ అధినేత జగన్ ను కలిసిన నియోజకవర్గ యువజన అధ్యక్షుడు పాలేటి నాగార్జున
జన సేవాదళ్ ఆధ్వర్యంలో చేయూత