కెసిఆర్ హరీష్ రావులకు అవినీతి భయం పట్టుకుంది.

కెసిఆర్ హరీష్ రావులకు అవినీతి భయం పట్టుకుంది.

ఐ ఎన్ బి టైమ్స్  సిద్దిపేట జిల్లా ప్రతినిధి.జూన్ 08:
 కెసిఆర్ హరీష్ రావులకు 10 సంవత్సరాల బీఆర్ఎస్ అవినీతి పాలనలో  చేసిన అవినీతి భయం పట్టుకుంది అని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. సిద్ధిపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ నాయకులకు భయం పట్టుకుంది అని అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై కమిషన్ వేయడంతో అందులో పాలు పంచుకున్న అవినీతిపరులు ఆందోళన పడుతున్నారు అని అన్నారు. లక్షల కోట్లు దుర్వినియోగం చేస్తూ అవినీతికి పాల్పడ్డ నాయకులను అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని అన్నారు. ఇన్ని రోజులు ఒకరినొకరు పట్టించుకోకుండా ఉన్న నాయకులు ఈటల రాజేందర్ హరీష్ రావు ల చీకటి భేటీ పై ప్రజలకు వివరించాలి అని అన్నారు. కెసిఆర్ ప్రభుత్వం అవినీతికి పాల్పడలేదని అబద్దాలను కప్పిపుచ్చుకునేందుకు హరీష్ రావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో ఒరిగింది ఏమీ లేదు అని అన్నారు. మామ అల్లుడు తో పాటు అందులో అవంతిక పాల్పడ్డ వారందరూ జైలుకు వెళ్ళక తప్పదు అన్నారు.  ప్రాణహిత చేవెళ్లతో తక్కువ బడ్జెట్ లో పూర్తయితుండే అని కావాలని కాళేశ్వరం పేరిట డిజైన్ మార్చి లక్షల కోట్లు రాష్ట్రంపై రాష్ట్ర ప్రజలపై ఆర్థిక భారం వేశారు అని అన్నారు. కాలేశ్వరంలో చేసిన అవినీతితో టిఆర్ఎస్ పని రాష్ట్రంలో అయిపోయినట్లే అని వారి దుకాణం మూసుకోవాల్సిందే అని అన్నారు. మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు జిమ్మిక్కులు మాయలు చేసిన ప్రజలు నమ్మే స్థితిలో లేరు అని ఉన్నారు. ఇప్పటికైనా చేసిన తప్పు ఒప్పుకొని ప్రజల ముందు అవినీతి వివరాలు వెల్లడిస్తే కొంచెం అయినా నమ్ముతారు అని అన్నారు. లక్షల కోట్లు అవినీతి జరిగిన కాంగ్రెస్ ప్రభుత్వం పై ఇప్పటికీ నోరు జారుతున్నారు అని అన్నారు. ప్రజలకు ఏది మంచో ఏది చెడో అన్ని తెలుసు అని ప్రజలు అన్నీ గమనిస్తున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట పట్టణ కార్యదర్శి గాదారి మధు యువజన పట్టణ అధ్యక్షులు గయాజుద్దీన్ మైనార్టీ పట్టణ అధ్యక్షులు సలీం. నజ్జు తదితరులు పాల్గొన్నారు

Tags:
Views: 2

Advertisement

Latest News

తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి. తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి.
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి జులై 06:దుర్గి మండలంలోని హిందూ దేవాలయాలల్లో తెలుగువారి తొలి పండుగ తొలిఏకాదశి వేడుకలను ఆదివారం భక్తులు భక్తి శ్రద్దలతో...
నీ చల్లని నీడలో.. నీ చక్కని సీమలో.. అంటూ భక్తులు.
మంచికల్లు కొండమీద స్వామి మమ్మల్ని మంచిగా చూడయ్యా
ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోవాలి... ఆలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం
డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన కూకట్పల్లి ఇంచార్జ్: బండి రమేష్
వైసీపీ అధినేత జగన్ ను కలిసిన నియోజకవర్గ యువజన అధ్యక్షుడు పాలేటి నాగార్జున
జన సేవాదళ్ ఆధ్వర్యంలో చేయూత