అవాస్తవ ప్రచారాలు మానుకోకపోతే తగిన బుద్ధి చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతుంది
ఐ ఎన్ బి టైమ్స్ రాజుపాలెం మండలం జూన్ 06 : రాజుపాలెం మండలం,పెద్ద నెమలి పూరి గ్రామానికి చెందిన గుప్తా లక్ష్మణరావు అనే వైసీపీ కార్యకర్త అతను విశాఖపట్నం శ్రీకాకుళం పరిసర ప్రాంతాలలో రోజువారి వాయిదా సామాన్లు అమ్ముకొని జీవిస్తాడు అతను తన ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యల తోటి ఆత్మహత్యా ప్రయత్నం చేయటం జరిగింది . సదరు విషయం గురుజాల నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్చార్జి కాసు మహేశ్వర్ రెడ్డి,జగన్ అభిమాని కావడం వల్ల సత్తెనపల్లి పోలీసు వారు వేదించటం వల్ల ఆత్మహత్య ప్రయత్నం చేశాడు అని ఈరోజు ప్రెస్ మీట్ లో తెలియజేయడం జరిగింది.సదరు విషయం అవాస్తవం తన ఆర్థిక సమస్యలతో చేసిన ఆత్మహత్య ప్రయత్నాన్ని తెలుగుదేశం పార్టీ పై, సత్తెనపల్లి పోలీస్ అధికారి పై దుష్ప్రచారం చేయటం చాలా బాధాకరమైన విషయమని.ఇకనైనా వైసీపీ పార్టీ కాసు మహేశ్వర్ రెడ్డి ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని మానుకోకపోతే మీకు తగిన విధంగా బుద్ధి చెప్పడం జరుగుతుందని తెలియజేయడం జరుగిందని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పూజల వెంకట కోటయ్య.తెలుగుదేశం పార్టీ
Comment List