సమాజానికి పట్టిన చీడ సాక్షి : ఎమ్మెల్యే జూలకంటి
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి జూన్ 08 : సమాజానికి పట్టిన చీడ జగన్ రెడ్డి అవినీతి మీడియా సాక్షి అని మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ధ్వజమెత్తారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని వేశ్యల రాజధాని అని సాక్షి మీడియాలో జగన్ రెడ్డి సతీమణి భారతి రెడ్డి మాట్లాడించడం పై నిరసన వ్యక్తం చేస్తూ స్థానిక ప్రధాన కూడలిలో కూటమి కార్యకర్తలు, నాయకులతో కలిసి సాక్షి ప్రతులను ఎమ్మెల్యే తగలబెట్టి, అసహనాన్ని వ్యక్తం చేశారు. దైవంతో సమానమైన రాజధానిని వేశ్యగా చిత్రీకరించి, కామెంట్స్ చేసిన జర్నలిస్టులు కొమ్మినేని, కృష్ణంరాజు లను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం కారంపూడి పిఎస్ లో కూటమి నాయకులు సాక్షి యాజమాన్యం పై నీచంగా మాట్లాడిన జర్నలిస్టుపై ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఓటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags:
Views: 2
About The Author
Related Posts
Post Comment
Latest News
02 Jul 2025 08:22:59
ఐ ఎన్ బి టైమ్స్ నాయుడుపేట ప్రతినిధి జూలై 01: తాడేపల్లిలోని వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో యువజన విభాగం రాష్ట్ర స్థాయి సమావేశంలో భాగంగా వైసీపీ అధినేత...
Comment List