పల్నాడు పారిశ్రామీకంగా పురోగమించాలి..!
ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి జూన్ 08:పారిశ్రామీకవేత్తలు పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టి పల్నాడును పారిశ్రామీకంగా పురోగమించేలా కృషి చేయాలని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి కోరారు. ఆదివారం దుర్గి మండలం, ఆత్మకూరు శివారులో ప్రముఖ కాంట్రాక్టర్ మారం ప్రసాద్ తారు ప్లాంట్ పరిశ్రమ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే జూలకంటి ముఖ్య అతిధిగా హాజరై, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్లాంట్ కు సంబంధించిన మిషనరీస్ ను ఆయన బటన్ నొక్కి ప్రారంభించారు. పరిశ్రమ ప్రాంగణంలో వివిధ రకాల మొక్యలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.., మాచర్ల నియోజకవర్గంలో పరిశ్రమల స్ధాపనకు అనుకూలమైనదని.., అవసరమైన మౌళిక వసతులను యుద్ధప్రాతిపదికన సిద్దం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దుర్గి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags:
Views: 1
About The Author
Related Posts
Post Comment
Latest News
06 Jul 2025 22:16:33
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి జులై 06:దుర్గి మండలంలోని హిందూ దేవాలయాలల్లో తెలుగువారి తొలి పండుగ తొలిఏకాదశి వేడుకలను ఆదివారం భక్తులు భక్తి శ్రద్దలతో...
Comment List