ఉచిత యోగా కార్యక్రమంపై మాట్లాడుతున్న మాచర్ల మున్సిపల్ చైర్మన్ షేక్ మదర్ సాహెబ్
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి జూన్ 22 :స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ మాచర్ల వారి ఆధ్వర్యంలో నిర్వహించుచున్న మాచర్ల శ్రీశైలం రోడ్ లో గల స్వామి వివేకానంద సేవాశ్రమంలో ఉచిత యోగ కార్యక్రమాన్ని మరలా ప్రారంభించినట్లు స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ మెట్టు గోవింద రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దలు పట్టణ ప్రథమ పౌరుడు అయినటువంటి మాచర్ల మున్సిపల్ చైర్మన్ షేక్ మదరసాహెబ్ హాజరై మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క ఆదేశాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నిన్నటి రోజున ఘనంగా విశాఖలో అంతర్జాతీయ యోగా డేను నిర్వహించుకున్నామని తెలిపారు .ప్రధానమంత్రి,ముఖ్యమంత్రి యొక్క స్ఫూర్తితో వారి ఆదేశాలతో యోగా ప్రతి ఇంటికి వెళ్లాలి, ప్రతి వ్యక్తికి వెళ్ళాలి, యోగ భారత్ గా వెలగాలి, ఆరోగ్య భారత్ గా వెలగాలి, యోగాంధ్రగా వెలగాలి, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా వెలగాలి అనే సంకల్పాలను కార్యరూపం దాల్చేందుకు ఈరోజు మెట్టు గోవింద రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత యోగా కార్యక్రమం ఏర్పాటు చేయటం చాలా ఆనందదాయకమని ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని కి విచ్చేసి ప్రతిరోజు యోగాలో పాల్గొని ఆరోగ్య వంతులుగా తయారు కావాలని పిలుపునిచ్చారు. మాచర్ల మరియు పట్టణ ప్రజలకు మెట్టు గోవిందరెడ్డి స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్య ,అన్నదాన ఇంకా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు అందిస్తున్నారని ముఖ్యంగా ఆరోగ్యం కొరకు ఈ ఉచిత యోగా కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా అభినందించదగ్గ విషయం అన్నారు. స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ మెట్టు గోవింద రెడ్డి మాట్లాడుతూ జనవరి 26 2025 రిపబ్లిక్ డే రోజున ప్రారంభించిన కార్యక్రమం మే 21వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుండి 8 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగిందని తెలిపారు. మన ముఖ్యమంత్రి యొక్క ఆదేశాల మేరకు మే 21వ తేదీ నుండి జూన్ 21 వరకు యోగ మాసంగా ప్రకటించినందున మన మాచర్ల మున్సిపల్ కమిషనర్ డి వేణు బాబు యొక్క ఆదేశాల మేరకు మున్సిపల్ ఆఫీసులో చేయమని మమ్ములను ఆజ్ఞాపించడంతో మేము ఆ నెల రోజులు అక్కడే ప్రతిరోజు శిక్షణ ఇచ్చామని తెలిపారు. మరల ఈ ఉచిత యోగ కార్యక్రమాన్ని కొనసాగించే ఉద్దేశంతో ఈరోజు నుండి ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి ఎనిమిది గంటల వరకు యోగ, ప్రాణామాయం, మెడిటేషన్ ఎప్పటి లాగానే ప్రతిరోజు కొనసాగుతుందని ఈ కార్యక్రమాన్ని మన మాచర్ల ప్రథమ పౌరుడు మున్సిపల్ చైర్మన్ షేక్ మదర్ సాహెబ్ ద్వారా ప్రారంభించుకోవడం మాకు చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా గోవింద రెడ్డి తెలియజేశారు. కావున ప్రతి ఒక్కరూ యోగాలో పాల్గొని ఆరోగ్యంగా జీవించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం అనంతరం మాచర్ల ప్రథమ పౌరుడు మాచర్ల మున్సిపల్ చైర్మన్ షేక్ మదర్ సాహెబ్ ని యోగ సభ్యులందరూ ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు ముత్యాల పాపి రెడ్డి, అందుగుల చంద్రయ్య, పోలిశెట్టి పిచ్చయ్య, షేక్ చినలాలు సాహెబ్, ఆర్టీసీ ఎంప్లాయి శ్రీనివాసరావు, సైదమ్మ, రుక్మిణి ,ఇరూవంటి శ్రీనివాసరావు తదితరులు యోగ సభ్యులు పాల్గొన్నారు.
Comment List