ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోవాలి... ఆలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం

ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోవాలి... ఆలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం

ఐ ఎన్ బి టైమ్స్ కూకట్పల్లి ప్రతినిధి, జూలై 6:శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో రాష్ట్ర దేవాదాయ,అటవీ, పర్యావరణ శాఖ మంత్రి  కొండా సురేఖ, పీఏసీ చైర్మన్,శేరిలింగంపల్లి శాసన సభ్యులు  ఆరెకపూడి గాంధీ , గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్  గంగాధర్ రెడ్డి  ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు వారిని ఘన స్వాగతం పలికి, పూలమాలతో సత్కరించారు. వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందించి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయాల అభివృద్ధికి కట్టుబడి ఉందని దేవాదాయ, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ తెలిపారు. గోపనపల్లి గ్రామంలో ఇస్కాన్ సంస్థకు 1.5 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించినట్లు మంత్రి కొండ సురేఖ పేర్కొన్నారు. ఈ భూమిలో వేద పాఠశాల, ఆలయం, మెగా కమ్యూనిటీ కిచెన్, గోశాలను ఇస్కాన్ సంస్థ వారు నిర్మించినట్లు వారు తెలిపారు. ఈ కేటాయింపు భక్తుల సంక్షేమానికి, సాంస్కృతిక విలువల పరిరక్షణకు, గ్రామీణాభివృద్ధికి, సామాజిక సేవకు ఈ భూ కేటాయింపు దోహదపడనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అనంతరం కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి  మాట్లాడుతూ ఆలయం, వేద పాఠశాల, గోశాల వంటి ధార్మిక, సాంస్కృతిక నిర్మాణాల కోసం భూమి కేటాయింపుతో గచ్చిబౌలి డివిజన్‌ అభివృద్ధికి మరింత  తోడ్పడుతుందని కార్పొరేటర్  పేర్కొన్నారు.గోపనపల్లి గ్రామ అభివృద్ధి తనకెంతో ప్రాధాన్యమని, గ్రామ ప్రజల ఆకాంక్షలు సాకారం కావడానికి ప్రతి ప్రయత్నం చేస్తానని స్పష్టం చేశారు. స్థానికంగా భక్తులక,గ్రామీణ యువతకు సాంస్కృతిక, ధార్మిక విలువలు నేర్పేలా ఇస్కాన్ సంస్థతో కలిసి కార్యాచరణకు పూర్తిగా మద్దతుగా నిలుస్తానని తెలిపారు. ఈ భూమి కేటాయింపు ద్వారా నిత్య అన్నదాన కార్యక్రమాలు, వేద విద్యా బోధన, పశుసంరక్షణ సేవలు, అలాగే కమ్యూనిటీ కిచెన్ వంటి సదుపాయాలు స్థానిక ప్రజలకు అందుబాటులోకి రానున్నాయన్నారు. భక్తి, సేవా, శాంతి మార్గాల్లో గోపనపల్లి గ్రామాన్ని తీర్చిదిద్దేందుకు ఇది కీలకమైన ముందడుగు అని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఇస్కాన్ సంస్థ ప్రజా ప్రతినిధులు,భక్తులు,మహిళలు,స్థానిక నేతలు, సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Tags:
Views: 3

Advertisement

Latest News

తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి. తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి.
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి జులై 06:దుర్గి మండలంలోని హిందూ దేవాలయాలల్లో తెలుగువారి తొలి పండుగ తొలిఏకాదశి వేడుకలను ఆదివారం భక్తులు భక్తి శ్రద్దలతో...
నీ చల్లని నీడలో.. నీ చక్కని సీమలో.. అంటూ భక్తులు.
మంచికల్లు కొండమీద స్వామి మమ్మల్ని మంచిగా చూడయ్యా
ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోవాలి... ఆలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం
డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన కూకట్పల్లి ఇంచార్జ్: బండి రమేష్
వైసీపీ అధినేత జగన్ ను కలిసిన నియోజకవర్గ యువజన అధ్యక్షుడు పాలేటి నాగార్జున
జన సేవాదళ్ ఆధ్వర్యంలో చేయూత