సత్యవేడు మాజీ ఎమ్మెల్యే, తిరుపతి మాజీ ఎంపీ,మాజీ మంత్రి సి.దాస్ 104వ జయంతి సందర్భంగా మొక్కలు పంపిణీ
సేవా మార్గంలో చిరస్థాయిగా నిలిచిన ప్రజానేత సి దాస్
ఐ ఎన్ బి టైమ్స్ వరదయ్యపాలెం, జూన్ 07:
సత్యవేడు మాజీ ఎమ్మెల్యే, తిరుపతి మాజీ ఎంపీ,మాజీ మంత్రి అయిన సి.దాస్104వ జయంతిని పురస్కరించుకుని ఆయన సేవలను స్మరించుకుంటూ,డీవీఎంసీ మెంబెర్ గుత్తి త్యాగరాజు ఆధ్వర్యంలో అభిమానులు,నివాళులు అర్పించారు.వరదయ్యపాలెం సర్పంచ్ జ్యోతి,మాజీ సర్పంచ్ కే వెంకటయ్య (చిన్న) హాజరై మొక్కలు పంపిణీ చేశారు. సత్యవేడు అన్నదాత నర్సరీ నుండి కొనుగోలు చేసిన నాణ్యమైన హిబ్రీడ్ జామ,టేకు మొక్కలను పంపిణీ చేశారు.సి.దాస్ మూడు సార్లు శాసనసభ్యుడిగా ప్రజలకు సేవలందించగా,రెండు సార్లు లోకసభకు ఎన్నికై తిరుపతి ప్రజల మన్ననలు పొందారని,మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించడంలో ఆయన ప్రత్యేక కృషి గుర్తించదగినదని,తాను ఉన్న పదవుల్లో అభివృద్ధి పనులకు పెద్ద పీట వేయడంతోపాటు,సామాజిక సేవా కార్యక్రమాలకు కూడా ముందుండేవారని ఆయన సేవలను వక్తలు కొనియాడారు.
సి.దాస్ తనలోని మానవతా విలువలను ప్రతిబింబించేలా నాయకులతో కలసి మెలసి ఉండేవారని అన్నారు.ఆయన సేవా మార్గం ఇప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచివుందని. సుమారుగా 25 సంవత్సరాల రాజకీయ సేవలతో అపారమైన అభిమానం సంపాదిచుకున్నారని గుత్తి త్యాగరాజు అన్నారు.మాజీ ముఖ్యమంత్రులు మర్రి చెన్నారెడ్డి, నందమూరి తారక రామారావు,వై ఎస్ రాజశేఖర రెడ్డి,ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుతో మంచి అనుబంధంగల నాయకుడిగా సి.దాస్ పేరు ప్రఖ్యాతులు పొందారు.నేటి తరం రాజకీయ నాయకులకు సి.దాస్ సేవలు స్ఫూర్తిగా నిలుస్తుందని అభివర్ణించారు.మొక్కలు అందుకున్న వారు సైతం ఆయన సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో సధానందం శ్రీనివాసులు,చంద్రశేఖర్,ముని చంద్ర, మాధవయ్య తదితరులు పాల్గొన్నారు.
Comment List