దేవతల రాజధానిని వేశ్యతో పొల్చుతారా..? పైశాచిక సైకోలకు వేదిక భారతీ మీడియా : ఎమ్మెల్యే జూలకంటి ఆగ్రహం

గ్రీన్ మాచర్లకు సహకరించాలి. - జగన్ మీడియాపై చట్ట ప్రకారం చర్య తీసుకోవాలి.

దేవతల రాజధానిని వేశ్యతో పొల్చుతారా..? పైశాచిక సైకోలకు వేదిక భారతీ మీడియా : ఎమ్మెల్యే జూలకంటి ఆగ్రహం

ఐ న్  బి టైమ్స్ మాచర్ల జూన్ 08: దేవతలు నడయాడిన నేల, సాక్ష్యాత్తు అమరలింగేశ్వరుడు కొలువుదీరిన పుణ్య క్షేత్రం ఏపీ రాజధానిని కండకావరంతో వేశ్యల రాజధాని అంటారా..? అని మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మాచర్ల పట్టణంలోని కిడ్స్ పాఠశాల వద్ద నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజా కార్యక్రమానికి ఎమ్మెల్యే జూలకంటి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.అనంతరం వనమహోత్సవంలో భాగంగా కిడ్స్ పాఠశాలలో మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో పరమ పుణ్య నేల, ప్రజా రాజాధాని అమరావతిని వేశ్యల నిలయం అని సంభోదించడం క్షమించరాని నేరం అని ఎమ్మెల్యే జూలకంటి ధ్వజమెత్తారు. రాజధానిపై వేశ్య అని ముద్రవేయడమంటే అది యావత్తు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మహిళలందర్నీ దూషించినట్లేనని వాపోయ్యారు. తప్పుడు విధానాలతో అవినీతి సొమ్ముతో స్ధాపించిన జగన్ మీడియాలలో సైకోలు పైశాచికత్వంతో కన్నుమిన్ను కానకుండా డిబెట్లు పెట్టి.., తెలుగు తల్లిని సైతం దూషిస్తున్నారని ఆరోపించారు. అవినీతి మీడియాను, అరాచక రాజకీయ పార్టీ వైసీపీని అడ్డంపెట్టుకుని ప్రాంతాలు,మతాలు, కులాల మధ్య చిచ్చు రేపుతూ.., వికృత క్రీడకు తెరలేపుతున్నారని విమర్శించారు.జగన్ మీడియాపై చట్ట ప్రకారం చర్య తీసుకోవాలి.జగన్ మీడియా సాక్షి పత్రిక, చానెల్ పై ప్రభుత్వం చట్ట ప్రకారం చర్య తీసుకునేలా మాచర్ల నియోజకవర్గంలోని అన్నీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని శ్రేణులకు ఎమ్మెల్యే జూలకంటి పిలుపునిచ్చారు. అన్నీ మండల కేంద్రాల్లో సాక్షి ఛానెల్ పై ఫిర్యాదు చేసి, చట్ట ప్రకారం న్యాయ పోరాటం చేయాలని ఆయన కోరారు. అలానే సాక్షి చానెల్ లో డిబెట్ పెట్టిన జర్నలిస్ట్ కొమ్మినేని, పాల్గొన్న కృష్ణంరాజు ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీలో సాక్షి మీడియాను బ్యాన్ చేయకుంటే.., ఇటువంటి  విధ్వేశాలను రెచ్చగొట్టి మరెన్నో సంఘటనలకు జగన్ అండ్ కో పాల్పడుతారని జోష్యం చెప్పారు.గ్రీన్ మాచర్లకు సహకరించాలి.మాచర్ల పరిశరాల పరిశుభ్రతతో పాటు పచ్చదనంతో పట్టణం విలసిల్లేలా అందరూ సహకరించాలని ఎమ్మెల్యే జూలకంటి కోరారు. పట్టణ నవీకరణకు, పచ్చదనానికి ప్రజలు, అధికారులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయాలకు అతీతంగా మేధావులు బాధ్యతగా వ్యవహరించినప్పుడే గ్రీన్ మాచర్ల సాధ్యపడుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. బడి,గుడి, ప్రభుత్వ స్థలాలు, పార్కింగ్ స్థలాలు వంటి చిన్న స్థలం కనిపించినా.., మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అలానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత దశాబ్ధాలుగా అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలు సైతం బాగుపడుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. మాచర్ల పట్టణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల ప్రత్యేక చొరవతో మౌళిక వసతులకు, తాగునీరు, ప్రజా సౌకర్యాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పెద్దఎత్తున నిధులు కేటాయిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాచర్ల మున్సిపల్ కమిషనర్ వేణుబాబు, చైర్మన్ మదార్ సాహెబ్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:
Views: 5

Advertisement

Latest News

తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి. తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి.
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి జులై 06:దుర్గి మండలంలోని హిందూ దేవాలయాలల్లో తెలుగువారి తొలి పండుగ తొలిఏకాదశి వేడుకలను ఆదివారం భక్తులు భక్తి శ్రద్దలతో...
నీ చల్లని నీడలో.. నీ చక్కని సీమలో.. అంటూ భక్తులు.
మంచికల్లు కొండమీద స్వామి మమ్మల్ని మంచిగా చూడయ్యా
ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోవాలి... ఆలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం
డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన కూకట్పల్లి ఇంచార్జ్: బండి రమేష్
వైసీపీ అధినేత జగన్ ను కలిసిన నియోజకవర్గ యువజన అధ్యక్షుడు పాలేటి నాగార్జున
జన సేవాదళ్ ఆధ్వర్యంలో చేయూత