దళితులు ఆర్థికంగా ఎదగాలి అల్ ఇండియా అంబేద్కర్ యువజన సంగం జాతీయ కోఆర్డినేటర్ యస్. వరుణ్ కుమార్
ఐ ఎన్ బి టైమ్స్ కూకట్పల్లి ప్రతినిధి, జూన్ 22:అల్ ఇండియా అంబేద్కర్ యువజన సంగం రాష్ట్ర కమిటీ 18 వ కోర్ కమిటీ సమావేశం రెడ్ హిల్స్ ఉన్న రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్ర పటానికి ఫూల మాల వేసి సమావేశాన్ని ప్రారంభించారు.ఈ సమావేశంలో జాతీయ కోఆర్డినేటర్ యస్. వరుణ్కుమార్, రాష్ట్ర అధ్యక్షులు కాడారం వినయ్ కుమార్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు కర్క నాగరాజు ప్రసంగిస్తు దళితులు ఆర్థికంగా ఎదగాలని ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ ద్వారా నిరుద్యోగ యువతీ యువకులు ఉపాధి పొందాలని, రాబోయే రోజుల్లో జనాభా లెక్కల్లో మరియు క్యాస్ట్ సెన్సుస్ లో విధిగా పాల్గొని తమ పేర్లునమోదు చేసుకోవాలని,ప్రభుత్వం ద్వారా దళిత సంక్షేమానికి సంబందించిన పథకాలను దళితులకు అందె విదంగా కృషి చేయాలని. ముఖ్యoగా యువత అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. త్వరలోనె గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ని రద్దు చేసి నూతన కమిటీ ని ఎన్నుకుంటారని వక్తలు తెలిపారు.ఈ కార్యక్రమం లో రాష్ట్ర సీనియర్ నాయకులు మధుకర్, భాస్కర్, రాష్ట్ర సెక్రటరీ జనరల్ జైప్రకాష్,రాష్ట్ర కోశాధికారి బాపనపల్లి ప్రమోద్ కుమార్, రాష్ట్ర కార్యదర్శులు శంకర్, అప్పలరాజు,జాయింట్ సెక్రటరీ ప్రభుదాస్, గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షులు మంజుల, సాతిరి వినయ్ కుమార్, ఆర్గనైసింగ్ సెక్రటరీ జక్కుల అశోక్, ఖైరతబాద్ నియోజకవర్గం అధ్యక్షులు సునీల్ కుమార్,కర్క మహేష్, చక్రి,రమేష్ పాటిల్,మి దాని యస్స్టీ అసోసియేషన్ నాయకులు మహేష్, రవి తదితరులు పాల్గొన్నారు.
Comment List