ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలి :సి హెచ్ ఓ ధనలక్ష్మి
ఐ ఎన్ బి టైమ్స్ : సూళ్లూరుపేట ప్రతినిధి, ఆగస్టు 12:ప్రతి విద్యార్థి వారి ఆరోగ్య పరిరక్షణ కొరకు పలు జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్య వంతులుగా ఉండాలని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ధనలక్ష్మి విద్యార్థులకు సూచించారు. మంగళవారం" జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం " పురస్కరించుకొని దొరవారిసత్రం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో దాదాపు 250 మంది విద్యార్థులకు ఆల్బెండజోల్ నులిపురుగుల నివారణ మందులు మింగించారు. ప్రధానంగా మానవ శరీరంలోని జీర్ణవ్యవస్థలో చేరి పలు అనారోగ్యానికి కారణమవుతున్న పరాన్న జీవులు ( నట్టలు)తో ఎదురవుతున్న అనారోగ్య సమస్యలను గురించి వివరించారు. వీటి నిర్మూల నివారణకు 6 నెలలకో పర్యాయం విధిగా ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని తెలియజేశారు. వీటిని నిర్మూలనకు ప్రాథమిక దశలోనే కట్టడి చేయడానికి బహిరంగ మల విసర్జన అలవాట్లు మానుకోవాలన్నారు, అదేవిధంగా భోజన సమయం కు ముందుగానే చేతులు శుభ్రపరచుకోవడం తప్పక పాటించాలన్నారు. విద్యార్థులకు హ్యాండ్ వాష్ ఎలా చేసుకోవాలి, వీటి ప్రయోజనం గురించి వివరించారు. రక్తహీనత, ఆకలి మందగించడం, పెరుగుదల లోపించడం వంటి లక్షణాలను దూరం చేయాలంటే, జీర్ణ వ్యవస్థలో పరాన్న జీవులను లేకుండా నిర్మూలించుకోవడానికి విధిగా ఆల్బెండజోల్ మందును మింగాలని అన్నారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో 3808 మొత్తం అర్హులైన పిల్లలలో 3604 మంది విద్యార్థులకు అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలో, గురుకులాలు, కాన్వెంట్లలో ని పిల్లలకు నులి పురుగులు నివారణమందులు వేశారు. ఈ కార్యక్రమంలో 95% శాతం లక్ష్యాలు పూర్తి చేశారు. ఎం జె పి బి సి గురుకులం, మావిళ్ళపాడు మోడల్ స్కూల్, హై స్కూళ్ళలో ఆరోగ్య సిబ్బంది.నేషనల్ డీ వార్మింగ్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ప్రిన్సిపాల్ పార్వతి, పిహెచ్ఎన్ శ్రీదేవి, హెచ్ వి పెంచలమ్మ, ఏఎన్ఎం డోరతి, హరిత, హెల్త్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు, కళాశాల నర్స్ సుమతి, ఆశ సుదర్శన మ్మ సిబ్బంది పాల్గొన్నారు.
Comment List