నిండుకుండలా పట్లవీడు చెరువు బ్రిడ్జి పై నుంచి పొంగిన వాగు
ఐఎన్ బి టైమ్స్ వెల్దుర్తి ప్రతినిధి ఆగష్టు 14;గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలంలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇక పట్లవీడు చెరువు నిండా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నిండు కుండ ను తలపిస్తుంది. దీంతో ఆ గ్రామ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెరువు నిండా నీరు వస్తే తమ పంట పొలాల్లో ఉన్న రాని బోర్లు కూడా నీటిని అందిస్తాయని, పత్తి, మిర్చి పంటలకు సరిపడా సాగునీరు అందుతోందని ఆ గ్రామ రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షం కారణంగా పట్లవీడు వాగు బ్రిడ్జి పై నుంచి నీరు పారడంతో రాకపోకలకు కొంత అంతరాయం ఏర్పడింది. పట్లవీడు, యర్రబాలెం, ముటుకూరు గ్రామాలకు వెళ్ళే ఆర్టీసీ బస్ చివరి ట్రిప్ కూడా రాత్రి వాగు బ్రిడ్జి పై నుంచి రావటంతో డ్రైవర్ హనుమంతు నాయక్ ఆర్టీసీ పై అధికారులను సంప్రదించి పట్లవీడు గ్రామం నుండే వెనక్కి తిప్పుకొని మళ్లీ మాచర్ల వెళ్ళటం జరిగింది. దీంతో యర్రబాలెం, ముటుకూరు గ్రామాల ప్రయాణీకులు పట్లవీడు గ్రామం లోనే వాగు ఉధృతి తగ్గే వరకు ఆగి తర్వాత వారి గమ్యస్థానాలకు వెళ్ళటం జరిగింది.
Comment List