పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచింది: యాగంటి మల్లికార్జునరావు
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఆగష్టు 14:అరాచకాలు రిగ్గింగ్లతో ఇప్పటివరకు గెలుస్తూ వచ్చిన వైయస్ అడ్డాలో మొదటిసారి ప్రజాస్వామ్యం గెలిచిందని, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జున రావు అన్నారు. పులివెందుల ఒంటిమిట్ట స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి విజయకేతనం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గురువారం మాచర్ల పట్టణంలోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటివరకు ప్రజాస్వామ్యం ఖూనీ జరిగిన పులివెందులలో మొదటిసారి ప్రజాస్వామ్యం గెలవడం పట్ల ప్రజల్లో హర్షం వ్యక్తం అవుతుందన్నారు. ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవడం వలన కనీసం వైకాపాకు డిపాజిట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. 30 ఏళ్ల అరాచక పాలనకు అక్కడి ప్రజలు చరమగీతం పాడి జగన్ కు బుద్ధి చెప్పారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అందిస్తున్న సుపరిపాలనకు తాజా ఎన్నికల ఫలితాలు నిదర్శనం అన్నారు. ఓటమి భరించలేక మాజీ ముఖ్యమంత్రి జగన్ అడ్డగోలుగా విమర్శలు చేయడాన్ని తప్పుపట్టారు. తండ్రి వయసున్న చంద్రబాబును జగన్ ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడటం మానుకోవాలని చెప్పారు. జగన్ పైశాచిక ఆనందం పొందడానికి చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. గత ఐదేళ్ల పాలనలో జగన్ చేసిన పరిపాలన వల్ల అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయి విమర్శించారు. రాష్ట్రంలో ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా తాజాగా పులివెందులలో వచ్చిన ఫలితాలే వస్తాయని యాగంటి పేర్కొన్నారు. పులివెందుల ఒంటిమిట్టలో ఓటర్లను భయభ్రాంతులను చేసింది వైసీపీ అని చెప్పారు. స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత పులివెందల ఓటర్లు మొహాల్లో కొత్త వెలుగులు నిండాయని అన్నారు. ఇకనైనా జగన్ తన బుద్ధి మార్చుకుని అధికార పార్టీపై విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.
Comment List