ఎయిడ్స్ నిర్మూలన పై అవగాహన ర్యాలీ
ఐ ఎన్ బి టైమ్స్ తిరుపతి ప్రతినిధి, ఆగస్టు 12:తిరుపతి జిల్లా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాలయం ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ అధికారి వారి ఆధ్వర్యంలో ఈ రోజు ఇంటెన్సిఫైడ్ క్యాంపెయిన్ ప్రారంభించి మహమ్మారి హెచ్ఐవి ఎయిడ్స్ పై మరియు మాధకద్రవ్య వ్యసనాలపై యువతకు అవగాహన నిర్మూలన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జిల్లా వైద్యాధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ గారు ర్యాలీ లో పాల్గొని, ఐ ఈ సి కాంపెయిన్ యొక్క పోస్టర్ లను ఆవిష్కరించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మరియు తిరుపతి జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ అధికారి డాక్టర్ శైలజ గారు మాట్లాడుతూ హెచ్ఐవి పై ప్రతి ఒక్కరికి అవగాహన కావాలని వారి పట్ల ఎలాంటి వివక్షత చూపరాదని చెప్పడం జరిగింది. క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ కోటి రెడ్డి గారు మాట్లాడుతూ యువత కి హెచ్ఐవి/ఎయిడ్స్ మరియు మత్తు పదార్థాలకు బానిసలై సన్నిహితులతో కలిసి సిగరెట్టు, మందుకు అలవాటై, అలా గంజాయి వరకు కూడా వ్యసనాలకు బానిసలై జీవితం విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. యువతకు హెచ్ఐవి/ఎయిడ్స్ పై అవగాహనతో పాటు ప్రతి కాలేజీలో కూడా కౌన్సిలింగ్ కార్యక్రమలు నిర్వహించడం చాలా మంచిదని , హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ చట్టం 2017 యాక్ట్ గూర్చి క్లుప్తంగా వివరించడం జరిగింది, ఈ IEC ఇంటెన్సిఫైడ్ క్యాంపెయిన్ కార్యక్రమములో బాగంగా జిల్లా వైద్య శాఖ కార్యాలయం నుండి స్విమ్స్ సర్కిల్ వరకు ర్యాలీకి నిర్వహించటం జరిగింది. ర్యాలీ లో మెడికల్ సిబ్బంది, యువత, నర్సింగ్ కాలేజీ విద్యార్థులు, స్వచ్చంద సేవ సంస్థల సిబ్బంది మరియు లింక్ వర్కర్ స్కీం సిబ్బంది, సిఎస్సి, షేర్ ఇండియా, సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఈకార్య క్రమం లో ఇంకా డాక్టర్ శ్రీనివాసరావ్ ఇతర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Comment List