కారంపూడి చెన్నకేశవ స్వామి దేవస్థానం చైర్మన్ గా లక్ష్మీనారాయణ నియామకం
ఐఎన్ బి టైమ్స్, కారంపూడి ప్రతినిధి, ఆగష్టు 14;పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి పట్టణంలో స్వయంభువుగా వెలసిన శ్రీ భూదేవి సమేత చెన్నకేశవ స్వామి దేవస్థానం చైర్మన్ గా బోడిగొడుగుల లక్ష్మీనారాయణ ను మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి సిఫార్సు మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం నియమించటం జరిగింది. మిగతా వారిని ధర్మకర్తలుగా కాలే స్వప్న, వలే మమత, కొండ విష్ణుదేవి, సాగినబోయిన పద్మ,ఆట్లూరి వెంకటనారాయణ, పల్లిశెట్టి శ్రీనివాసరావు, వడ్ల మల్లిఖార్జునరావు, సాగి వెంకటేశ్వర్లు, అర్చకుడుగా కోమండూరి సత్యనారాయణ చార్యులను నియమించారు. ఈ సందర్భంగా వారు కారంపూడి దేవాదాయ శాఖ అధికారి కొల్లి. హనుమంతరావు ఆధ్వర్యంలో త్వరలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా వారు తమపై నమ్మకంతో ఈ ధర్మకర్తలుగా నియమించినందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ సందర్భంగా వారు ఏపీ సిఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.
Comment List