ఇరు వర్గాలపై బైండోవర్ కేసులు నమోదు...గోకవరం ఎస్సై పవన్ కుమార్...
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్, గోకవరం ప్రతినిధి, ఆగస్టు 14:lఇటీవల గోకవరం గ్రామానికి చెందిన రెండు వర్గాల మధ్య జరుగుతున్న వివాదం ముదురుతున్న నేపథ్యంలో మండలంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఇరువర్గాలపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు గోకవరం ఎస్సై వై. పవన్ కుమార్ తెలిపారు. బిజెపి నాయకులు శ్రీనివాసరావు వర్గం,బాపన్న దొర వర్గం వీరి ఇరువురి వర్గాల మీద గోకవరం పోలీసులు బైండోవర్ కేసు నమోదు చేశారు. ఇకపై రెండు వర్గాలవారు ఒకరినొకరు విమర్శించుకుంటూ ఎటువంటి ప్రెస్ మీట్ లు నిర్వహించకూడదని ఇరు వర్గాలకు పోలీసులు సూచించారు. శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకొని ఈ చర్యలు తీసుకున్నట్లు గోకవరం ఎస్సై తెలిపారు..
Tags:
Views: 1
Latest News
25 Sep 2025 08:14:58
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 24:ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా, బుధవారం మాచర్ల పట్టణంలో నిర్వహించిన ‘స్వస్థ నారి –...
Comment List